డాక్టర్ సుధాకర్ పై సిబిఐ కేసులు, బయటపడుతున్న నిజాలు

డాక్టర్ సుధాకర్ కేసు మలుపులు తిరుగుతోంది. వారం రోజులుగా విశాఖ సీబీఐ అధికారులు ఇక్కడి ఫోర్త్ టౌన్, కేజీహెచ్, మానసిక ఆసుపత్రి సిబ్బంది నుంచి వివరాలు సేకరించగా మంగళవారం అనూ
హ్యంగా డాక్టర్ సుధాకర్ పైనా కేసు నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను తన వెబ్ సైట్ లోనూ పొందుపర్చింది.

ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్ మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా మాట తూలడం, ఓ కానిస్టేబుల్ మొబైల్ ను కిందపడేయడం, తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రీప్ట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసారన్నది సీబీఐ ఆరోపణలుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 23 సాక్షుల సమాచారంతో 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్ ను ఇక్కడి ఫోర్త్ టౌన్ పోలీసులు సీబీఐకి అందజేయగా దాని ఆధారంగా కూడా సీబీఐ ఇన్స్పెక్టర్ శర్మ ఓ ఎస్ఎఆర్ వేసినట్టు తెలిసింది.

అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డాక్టర్ సుధాకర్ పై సెక్షన్ 188 నమోదు చేసింది. ఇన్నాళ్లు సుధాకర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజా సంఘాలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినప్పటికీ మంగళవారం అకస్మాత్తుగా డాక్టర్ సుధాకర్ పైనా సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనమైంది. హై కోర్టు ఆదేశాలమేరకు పోలీసులపై కేసు నమోదు చేసిన సీబీఐ అందుకు కౌంటర్ గా తాజాగా డాక్టర్ పైనా కేస్ నమోదు చేయడంతో ఇక ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని అన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి.