పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అంబికా సంస్థలపై సీబీఐ సోదాలు జరుపుతోంది. ఆ సంస్థలతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ళలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంబికా సంస్థలకు సంబంధించి వేర్వేరు పేర్లతో లోన్లు సేకరించారన్న ఆరోపణలు వచ్చాయి. అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ గృహంలోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

7 నెలల అనంతరం మరోమారు ఇలా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకూ అధికారులు కానీ.. అంబికా కానీ మీడియా ముందుకు రాలేదు. అయితే సోదాల్లో ఏమేం దొరికాయి..? లోన్ల సంగతేంటి..? అనే విషయాలపై సీబీఐ అధికారులు ఇవాళ సాయంత్రం మీడియా మీట్ నిర్వహించి వెల్లడిస్తారని సమాచారం.