బ్రేకింగ్ : ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంట్లో సిబిఐ దాడులు
Timeline

బ్రేకింగ్ : ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంట్లో సిబిఐ దాడులు

ఎంపీ రఘు రామ కృష్ణం రాజు హైదరాబాదు ఇంట్లో సీబిఐ సోదాలు . ఢిల్లీ నుండి వచ్విన సీబిఐ ప్రత్యేక బృందాలు, ఇందు,భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టు సమాచారం. ఉదయం ఆరు గంటలనుండి, రెండు తెలుగు రాష్ట్రాల లో తన నివాసాల పై సీబీఐ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది.

2019 ఎన్నికల ముందు కూడా ఈయనపై బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబిఐ దాడులు జరిగాయి. 3 NBFC ల నుండి 2655 కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని ఎగ్గొట్టారనే ఆరోపణల కారణంగా ఆ దాడులు జరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి .

ఇపుడు అయన వైసీపీ పార్టీ లోనే ఉండి , బీజేపీ కి దగ్గరవ్వాలని చూడటం ఇంతలోనే మళ్ళీ సిబిఐ దాడులు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి.