ఆయుర్వేద డాక్టర్లకు కూడా ఆ ఆపరేషన్లు చేయడానికి కేంద్రం అనుమతి

ఈమధ్య కాలంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది. విదేశీ డాక్టర్లు కూడా ఆయుర్వేదం పై వ్యాఖ్యలు చేయడం వాటిని ప్రమోట్ చేయడం పై ఆయుర్వేద డాక్టర్లకు డిమాండ్ కూడా పెరిగిందే చెప్పాలి. ఇపుడు వారి కోసం కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఆయుర్వేద డాక్టర్లు కూడా ఆపరేషన్ చేయవచ్చు అని దాని కోసం కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది..

ఇకపై ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్లు వివిధ రకాల సాధారణ శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ 2016 రూల్స్‌ను సవరించింది.

షాలియా ( సాధారణ శస్త్రచికిత్స ), షాలక్య (చెవి, ముక్కు, గొంతు, ఇఎన్‌టి, కంటి వ్యాధులు , తల, ఓరో-డెంటిస్ట్రీ ) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది.

శస్త్రచికిత్సా విధానాలకు సంబంధించిన శిక్షణా విధానాలు ఆయుర్వేద అధ్యయనాల పాఠ్యాంశాల్లో చేర్చబోతున్నారు. ఈ కోర్సు పూర్తయిన అనంతరం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాక శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద డాక్టర్లు స్క్రిన్‌ గ్రాఫ్టింగ్‌, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా చేయవచ్చు. ప్రభుత్వం నవంబర్ 19న దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.