Breaking News :

పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు అనేక పోరాటాలు చేశారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఆ దిశగా కృషి చేయకపోవడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో బోర్డు ఏర్పాటు చేయాలని సుమారు 190 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పసుపు రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. నిజామాబాద్‌లో అత్యాధునిక పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిపై కేంద్రం త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం.

Read Previous

పవన్ సినిమాపై తమన్ క్లారిటీ

Read Next

బీజేపీ-జనసేన: మరికాసేపట్లో కీలక సమావేశం