బాబు గారి డిమాండ్లు

9

ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇసుక కొరతని నిరసిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ లో 12 గంటల నిరసన దీక్షకు దిగారు. మూడు డిమాండ్లని తెలియజేస్తూ, వీటిని నెరవేర్చాల్సిందిగా చంద్రబాబు నిరసన దీక్షకి దిగారని తెలిపారు. అయితే ఆ మూడు డిమాండ్లు ఏమిటంటే, ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టడం, ఇసుక కొరత వలన ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రధానం చేయాలి, అంతేకాకుండా ఈ అయిదు నెలల్లో జీవనోపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయల పరిహారం అందజేయడం. ఈ మూడు డిమాండ్లని ఉద్దేశించి చంద్రబాబు నిరసన దీక్షకు కూర్చోవడం జరిగింది.

అయితే జగన్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల పై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇసుక కొరత పై నిరసన దీక్ష చేపట్టిన చంద్రబాబు కి మద్దతుగా బీజేపీ, జనసేన పార్టీలు నిలిచాయి. అయితే విజయవాడలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రం నలువైపుల నుండి తెలుగు దేశం నాయకులూ, కార్యకర్తలు తరలి రానున్నారు.