బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా?
Timeline

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా?

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విపక్షాలు టీవీ డిబేట్లలో దుమారం లేపుతున్నాయి. లాజిక్కు లేకుండా వాదనలు చేస్తున్నారు. వీళ్లకు తోడు పచ్చ మీడియా యాంకర్లు ఎమోషనల్ అయిపోయి మరీ లైవ్ లోనే ఏడ్చేస్తున్నారు.

నిన్న గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చం.బా నాయుడు గారు జూమ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎమోషనల్ అయ్యారు. భవిష్యత్తులో నా మాటలు గుర్తు చేసుకుంటారని తెలిపారు.

అంతే లేకుండా TDP చీఫ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తనతో పాటు పార్టీ MLA లు అంతా సామూహిక రాజీనామాలు చేయాలని, అప్పుడే ఈ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని నాయుడు భావిస్తున్నట్లు వివరాలు అందుతున్నాయి. రాజీనామా అస్త్రంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నిన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.