సోనూ సూద్ కి చంద్రబాబు ఫోన్ కాల్
Timeline

సోనూ సూద్ కి చంద్రబాబు ఫోన్ కాల్

chnadrababu naiud sonu sood

చిత్తూరు జిల్లా మదనపల్లిలో నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు. కొంతసేపటి తర్వాత వారి కి కావాల్సింది ఎద్దులు కావు, వారికి కావాల్సింది ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. వారికి సాయంత్రాని కల్లా ట్రాక్టర్ పంపిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. సోనూసూద్ గొప్ప మనసు’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

రైతు కుటుంబానికి సాయం చేస్తానని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ మాట నిలబెట్టుకున్నారు. సోనూసూద్‌ చిత్తూరు జిల్లా మదనపల్లెలో ట్రాక్టర్‌ ఆర్డర్‌ చేశాడు. దీంతో షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసోద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్బంగా సోనూకు రైతు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు , చిత్తూరు ఆయన సొంత జిల్లా కావడంతో వెంటనే సోను సూద్ కి కాల్ చేసి ఆ రైతు కుటుంబానికి ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారట.

Leave a Reply

Your email address will not be published.