నవరత్నాలు కావు, నవ మోసాలు

11

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో బలపడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే కాగా ఈమేరకు నిత్యం రాష్ట్ర పర్యటనలు చేస్తూ ప్రస్తుతానికి బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు నాయుడు. కాగా బుధవారం నాడు జరిపిన సమావేశంలో భాగంగా టీడీపీ పార్టీ కి చెందిన యువ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అయితే ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.

ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న నవరత్నాలు అనేది పచ్చి అబద్దం అని, నవరత్నాలు పేరుతొ రాష్ట్ర ప్రజలందరినీ సీఎం జగన్ మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేకాకుండా కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్న నెపంతో ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని సీఎం జగన్ పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. తరువాత టీడీపీ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.