స్పీడు పెంచిన చంద్రన్న … తిరుపతి అభ్యర్థిగా మళ్ళీ ఆవిడే
Timeline

స్పీడు పెంచిన చంద్రన్న … తిరుపతి అభ్యర్థిగా మళ్ళీ ఆవిడే

తిరుపతి పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ఖరారు చేస్తూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపిగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్‌తో మృతి చెందడంతోఇప్పుడు ఆ ఎంపీ సీటు ఖాళీ అయింది. దీనితో ఆ స్థానంలో బలవంతులను రంగంలోకి దించి గెలవాలన్నది ప్రతిపక్షాల ఆలోచన. ఉప ఎన్నికలు ఎప్పుడుంటాయో ఇంకా తెలియదు. బహుశా వచ్చే సంవత్సరం మొదట్లో ఉండొచ్చని ఒక అంచనా మాత్రమే. అయితే అందరికన్నా ముందుగానే తమ అభ్యర్థిని ఖరారు చేసి చంద్రబాబు అధికార పార్టీకి ఝలక్ ఇచ్చారని అందరు అనుకుంటున్నారు. అయితే దీని వెనకున్న అసలు రహస్యం ఏంటంటే పనబాక లక్ష్మి టీడీపీ నుండి బీజేపీ కి జంప్ అవుతుందనే భయంతోనే ముందుగానే ఆవిడకి సీటు ఖరారు చేశారనేది పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఏది ఏమైనా జగన్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇటు టీడీపీ అటు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఇక జనసేన కూడా ఇప్పటికే బీజేపీ వర్గాలతో చర్చలు చేస్తుంది. తాము కూడా పోటీ చేయడానికి సిద్ధం అని , సీటు జనసేనకు కేటాయించాలనేది వారి డిమాండ్. మరి జగన్ ఎవరిని నిర్ణయిస్తాడు అనేది ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే