మోడీతో దోస్తీ కావాలి అంటున్న బాబు యూ-టర్న్ వెనక మాస్టర్ ప్లాన్ ఇదే
Timeline

మోడీతో దోస్తీ కావాలి అంటున్న బాబు యూ-టర్న్ వెనక మాస్టర్ ప్లాన్ ఇదే

బీజేపీ విషయంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చగా మారిపోయాయి.. బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లే టీడీపీ ఓటమి పాలైందన్న విషయం చంద్రబాబుకు తెలిసొచ్చిందా? లేక మరోసారి బీజేపీతో కలిసి వెళ్లడానికి బాబు ప్రయత్నిస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీతో విభేదించామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని చంద్రబాబు అనడం.. ఆ నిర్ణయంతో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోడానికి కారణమైందని చెప్పిన చర్చకు తెరలేపారు.

అయితే, టీడీపీ-బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ ధీయోధర్.. టీడీపీతో జత కట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయని తేల్చి చెప్పారాయన.. అటు వైసీపీ, జనసేన పార్టీలతోనూ పొత్తులు ఉండవన్న ఆయన.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవరితోనూ పొత్తులేదని, బీజేపీ  ఒంటరిగానే  పోటీ చేస్తుందని తెలిపారు.

చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకోవడానికి అసలు కారణం పోలవరం అవినీతిపై కేంద్రం చేసిన ప్రకటనే. చంద్రబాబు హయాం లో పోలవరం ప్రాజెక్టు విషయం లో అవినీతి జరిగిందని, వాటిపై విచారణ చేసి నిజాలు బయటకు తెచ్చే పనిలో బీజేపీ వర్గాలు పావులు కదుపుతున్నాయి. అందులోని అవినీతి నిజాలు బయటపడితే చంద్రబాబు రాజకీయ జీవితం ఇక పూర్తిగా ముగిసినట్టే అనేది బాబు భయం అని టీడీపీ లో ఇన్సైడ్ టాక్. అందుకే ముందు జాగ్రత్తగా తన శిష్యులను బీజేపీలోకి పంపించి, మెల్లిగా మోడీ తో దోస్తీ కడుదామనే ప్లాన్ లో బాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగమే ఈ యూ టర్న్ వ్యాఖ్యలు.

ఇప్పటికే మరోవైపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి నివేదిక తయారు చేశామని.. ఆ నివేదికను రేపు కేంద్ర జలవనరుల శాఖకు ఇస్తామని వెల్లడించారు సునీల్ ధీయోధర్.

Leave a Reply

Your email address will not be published.