చంద్రబాబు ఆర్డర్, జైల్లో రవి ప్రకాష్ ని కలిసిన రేవంత్ రెడ్డి

123

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌ను సోమవారం చంచల్‌గూడ జైల్లో ఎంపీ రేవంత్ రెడ్డి కలిశారు.ఆయనతో ములాఖత్ అయిన రేవంత్ రెడ్డి అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఓ దండుపాళ్యం ముఠాలా తయారైందని విమర్శించారు.

రవి ప్రకాష్‌పై ఇప్పటికే అలందా మీడియా పెట్టిన కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి.సింగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు.బోనస్,ఎక్స్‌గ్రేషియాల పేరుతో సంస్థ డైరెక్టర్ల అనుమతి లేకుండా రవి ప్రకాష్ రూ.18 కోట్లు విత్ డ్రా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.రవి ప్రకాష్‌తో పాటు మూర్తి అనే మరో టీవీ9 ఉద్యోగిపై కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అసలు కథ :

రవి ప్రకాష్ TV9 నుండి బయటకు వచ్చేసాక బీజేపీ తో కలిసి కొత్త ఛానల్ పెట్టబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ టైం చూసి బీజేపీ దెబ్బ కొట్టింది. గతంలో హిందూ ధర్మానికి వ్యతిరేక వార్తలు ప్రచారం చేశారనే కోపంతో, తన సీక్రెట్ గురువు చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్నికల ముందు బీజేపీ నేతలను చేతిలో ఛానల్ ఉందనే అహంకారంతో అసత్య వార్తలు ప్రచారం చేసి తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకతకు గురి చేశారనే కారణంతో తనని దూరం పెట్టేసింది.

బీజేపీ తో చేయి కలపమని రవి కి సలహా ఇచ్చింది కూడా చంద్రబాబే అని మీడియా వర్గాల్లో ఉన్నమాట. ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో, తన శిష్యుడు రేవంత్ రెడ్డి తో స్నేహాన్ని పెంచుకోమని, తెలంగాణ లో ఏ సహాయం కావాలన్న తాను చూసుకుంటాడని చంద్రబాబు చెప్పారట. అందుకే రేవంత్ తో చేతులు కలుపుకొని మోజో టీవీ రన్ చేద్దాం అనుకున్నారు. దానికి చెక్ పెట్టిన అలంద మీడియా ఒక రకంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. కాకపోతే ఈ సారి సోషల్ మీడియా ని నమ్ముకొని ముందుకు వెళుదామని , తన పాత వెబ్ సైట్ ని తేరా మీదికి తెచ్చాడు రవి ప్రకాష్. ఈ వెబ్ సైట్ లో పూర్తిగా కెసిఆర్ , జగన్ ని టార్గెట్ చేస్తూ , ప్రభుత్వ వ్యతిరేకుల చేత మాత్రమే కథనాలు రాయిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది.

సౌత్ ఇండియా పునాదిగా దక్షిణ భాషల్లో టీవీ చానళ్లకు పెట్టబోతున్న రవి ప్రకాష్ కి ఫండింగ్ కూడా చంద్రబాబు సమకూర్చుతాను అని మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇచ్చిన ఆర్డర్ తోనే డైరెక్టుగా జైలు కి వెళ్లి మరీ రవి ప్రకాష్ ని కలిశాడట రేవంత్ రెడ్డి. ఈ దెబ్బతో వాళ్ళ మధ్య ఇప్పటివరకు ఉన్న సంబంధం అనుమానం మాత్రమే అనుకున్న ప్రజలకు అది నిజమే అని బట్టబయలు అయిపోయింది.

ఒక ప్రతిపక్ష నేత , ఒక 420 కేసులో ఉన్న వ్యక్తిని జైలుకి వెళ్లి కలిసాడు అంటే, అది కూడా ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతుంటే ఏదో ఉంది మొత్తానికి అనే చర్చ ప్రజల్లో మొదలైంది.