ఏలూరు: కక్కుర్తితో బ్లీచింగ్ బదులు సుద్ద కలిపారు
Timeline

ఏలూరు: కక్కుర్తితో బ్లీచింగ్ బదులు సుద్ద కలిపారు

ఏలూరు సంఘటన పై స్పందించిన చంద్రబాబు నాయుడు. ప్రజల అనారోగ్యఐకి కారణం జగన్ నిర్లక్ష్యమే కారణం అని తెలిపారు. తాగునీఈటిని కూడా పరిరక్షించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని , అక్కడే ప్రభుత్వ వైఫల్యం తెలుస్తుందని అయన అన్నారు.పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, వారికి క్లోరిన్‌ సరఫరా కూడా చేయడం లేదని ఆరోపించారు. అందుకే వారు పనికిరాని సుద్ధ తెచ్చి క్లోరిన్‌ బదులుగా నీటిలో కలిపేశారని, దీంతో వందలాది మంది ప్రజలు ఆస్పత్రి పాలయ్యారని చంద్రబాబు తెలిపారు. ఏలూరు ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. పారిశుద్ద్యం విషయంలో ప్రభుత్వానికీ, సీఎంకు అవగాహన లేదని, దీని ఫలితమే ఏలూరు ఘటన అని చంద్రబాబు పేర్కొన్నారు. క్లోరిన్‌కు బదులుగా సుద్ధ పొడి వాడకంపై ఇప్పటికే స్దానిక ప్రజలు ఆందోళన చేశారని, ప్రభుత్వ విజిలెన్స్‌ విచారణ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published.