చంద్రబాబు వల్ల కరోనా అంటూ ట్విట్టర్ లో ట్రెండ్

‘కరోనా వైరస్’ లాక్ డౌన్ కారణంగా.. రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతికి బయల్దేరి వెళ్లారు.

నిజానికి ఆయన ఇవాళ విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది.  ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి అనుమతి కూడా లభించింది. విశాఖ వెళ్లి గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను ఆయన కలిసేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. కానీ అర్ధరాత్రి ఆంధ్ర ప్రదేశ్ లో విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. దీంతో ఆయన రోడ్డు మార్గంలోనే అమరావతికి బయల్దేరి వెళ్లారు.

ఐతే ఆయన దారిపొడవునా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఇందుకు సంబంధించి చంద్రబాబు వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ పోస్ట్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చంద్రబాబుకు స్వాగతం పలికారని దీని వాళ్ళ కరోనా వచ్చే ప్రమాదం ఉందని, అదంతా లెక్క చేయకుండా ఫోటోలకు ఫోజులిస్తూ చంద్రబాబు బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నారని నేషనల్ మీడియా కి సంబదించిన టాప్ జర్నలిస్టులు కామెంట్ చేసారు.

వెటకారంగా ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ ఎత్తేసారా ఏంటి అంటూ చురకలు అంటిస్తే, మరి కొందరేమో కాదు కాదు కేవలం చంద్రబాబు కి మాత్రమే సడలింపు ఇచ్చారు అంటూ ఎద్దేవా చేసారు.

ప్రజలకు కరోనా కష్ట కాలంలో ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున వెళ్లిన ఎమ్మెల్యేలను కామెంట్లు చేసి కోర్టు కి పంపించిన టీడీపీ కి ఇపుడు రాజకీయం చేయడానికి ఇలా రోడ్లపై ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం తప్పని తెలియదా అంటూ అధికార పార్టీ ఆరోపించింది.

ఇదేదో చిన్న విషయం అనుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం కానీ ఏకంగా దేశం మొత్తం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. ట్విట్టర్ లో టాప్ ట్రెండ్ లో #ChandrababuSpreadsCorona అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టి నిరసన తెలుపుతున్నారు.