అవినీతి డబ్బును వైట్ మనీగా మార్చుకోడానికే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ పెట్టారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే కోటానుకోట్ల లాభాలు, అధికారం పొతే నష్టాలు. ఏమిటో ఈ Heritage కిటుకు? అవినీతి డబ్బును వైట్ మనీగా మార్చుకోడానికే హెరిటేజ్ పెట్టాడా ? తన స్వార్థం కోసం పాడి రైతుల ఆధ్వర్యంలో నడిచే కో ఆపరేటివ్ డైరీలను సర్వనాశనం చేశాడు – రైతులను భ్రష్టు పట్టించాడు. అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ట్విట్టర్ లో కామెంట్లు చేసారు

హెరిటేజ్ మాది కాదు వేరే కంపెనీకి అమ్మేసాం అంటారు బాబు బ్యాచ్ .. అయితే ఇక్కడే అసలు కిటుకుంది. చంద్రబాబు వేరే కంపెనీకి అమ్మేసిన మాట వాస్తవమే కానీ దానికి బదులుగా అదే కంపెనీలో వట తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అంటే హెరిటేజ్ లో కూడా ఇంకా చంద్రబాబు షేర్ ఉన్నట్టే. అంతే కాకుండా వేరే కంపెనీకి అమ్మేస్తే ఇంకా హెరిటేజ్ లో బాబు కుటుంబం ఉండటం ఎందుకు ? వారి హయాంలోనే కంపెనీ నడవాల్సిన అవసరం ఏముంది అంటూ అధికార పార్టీ నేతలు , సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించడం చూస్తున్నాం.