కామెడీ చేస్తున్న చంబా నాయుడు
Timeline

కామెడీ చేస్తున్న చంబా నాయుడు

వైయస్ జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో రాజకీయ రచ్చ మీద మొదలయింది. అయితే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నేతలను రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా అమరావతి రైతులు కూడా చంద్రబాబే దీనంతటికి కారణం అంటూ విమర్శలు చేయడం కొసమెరుపు. చంద్రబాబును నమ్మితే గొంతు కోశాడని, వద్దన్నా వినకుండా భూములు లాక్కున్నారని తీరా భూములు ఇచ్చాక ఇపుడెల్ల హైదరాబాద్ లో కూర్చున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను మాత్రం ముందు జాగ్రత్తగా హెరిటేజ్ ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని మమ్మల్ని మాత్రం నిండా ముంచేసాడని వాపోతున్నారు.

ఈ రెండు రోజులు పచ్చ మీడియా ఛానళ్లలో బీజేపీ పై, జనసేన పవన్ కళ్యాణ్ పై సంబంధం లేని, లాజిక్కులేని విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయించి ప్రజల వ్యతిరేకతను టీడీపీ నుండి ఆ పార్టీల మీదకు మళ్లించే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు అని బీజేపీ – జనసేన నేతలు చెప్పుకొచ్చారు.

అయితే అధికార పార్టీ, మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల విమర్శలకు కౌంటర్ ఎలా ఇయ్యలో తేలిక రెండు రోజుల తరువాత కొత్త డైలాగ్ వీడియోతో చంద్ర నాయుడు జూమ్ లో దర్శనమిచ్చారు.

ఆ వీడియోలో మాట్లాడుతూ చంద్ర నాయుడు మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారని, మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్‌కు చం.బా సవాల్ విసిరారు.

మూడు రాజధానులను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదన్నారు. ఏపీ రాజధాని ఐదు కోట్ల ప్రజల సమస్య అని చెప్పారు. కులాలు, మతాల సమస్య కాదని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడానికి 48 గంటలు సమయం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తామందరం రాజీనామా చేస్తామని చెప్పారు.. వైసీపీ కూడా రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

అయితే శ్రీ నారా చం.బా నాయుడు గారు కామెడీ చేస్తున్నారని , ప్రజలను మోసం చేసింది టీడీపీ అని, అన్ని తాత్కాలిక భవనాలు నిర్మించి , అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి భూములతో అవసరం వాళ్లదని దమ్ముంటే టీడీపీ నేతలే రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని, కేవలం కొడుక్కి ఎమ్మెల్యే సీటు కూడా తెచుకోలేకపోయాడని అందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

ఎంతసేపు జగన్ ఎన్నికల ముందు చెప్పాడా చెప్పాడా అని అంటున్నారు, మరి 2014 ఎన్నికల ముందు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన హైదరాబాద్ ని రాత్రికి రాత్రి వదిలేసి ఓటు కి నోటు కేసులో బుక్కయ్యి వచ్చినపుడు ఇవన్నీ గుర్తు లేవా అని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మూడు రాజధానుల విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని కేవలం చంద్రబాబు తన పుత్ర రత్నం లోకేష్ మాత్రమే ఏడుస్తూ హైదరాబాద్ లో కూర్చున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.