చంద్రబాబు ఉంటే చంద్రయాన్ 2 సక్సెస్ అయ్యేది

దేశం అంతా ఉత్కంఠగా చూసిన చంద్రయాన్ 2 ప్రయోగంలో చివరి క్షణంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో తెలిపింది. ఇది ఇలాఉంటే నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు.

చంద్రబాబు ఉంటే చంద్రయాన్ 2 సక్సెస్ అయ్యేదని సెట్టైర్లు వేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, చంద్రయాన్ 2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు శ్రీహరికోటలో జరుగుతుండడమే. హైదరాబాద్ నేనే కట్టాను, హైదరాబాద్ నా వల్లే డెవలప్ అయింది. దాని తలదన్నే రాజధాని నేనే మరోసారి అమరావతిలో కడుతాను అని బాబు గతంలో చెప్పిన మాటలను గుర్తుచేస్తున్నారు.

ప్రతి అభివృద్ధి తానే చేశాను అని చెప్పుకునే బాబుకి, చంద్రయాన్ 2 ఐడియాలజీ కూడా తనదేనేమో అతని సేవలు ఇస్రో శాస్త్రవేత్తలు కోరుకుంటే బాగుండేదని సెట్టైర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం తాను అధికారంలో లేకపోవడంతో తోనే ఇలా సాంకేతిక సమస్య తలెత్తి ఉండచ్చేమోనని నెటిజన్లు పంచ్ లు పేలుస్తున్నారు.