Breaking News :

చంద్రయాన్-2: రంగంలోకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ

చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ పునురుద్ధరణకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో) శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది. విక్రమ్ ల్యాండర్ సిగ్నల్ ను గుర్తించేందుకు నాసా సైంటిస్టులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అమెరికాకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు స్కాట్ టిల్లే ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రా, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ ప్రాంతాల్లో నాసాకు డీప్ స్పేస్ స్టేషన్ యాంటెన్నాలు ఉన్నాయి. వాటి ద్వారా హలో అనే సంకేతాలను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇస్రో కంటే బలమైన, అత్యాధునికమైన సంకేతాలను చంద్రుడి మీదికి పంపిస్తున్నట్లు స్కాట్ టిల్లీ తెలిపారు. డీఎస్ఎన్ 24 బీమ్స్ 12 కిలోవాట్ల శక్తిమంతమైన సంకేతాలను పంపిస్తున్నామని వివరించారు.

తాము పంపిన సిగ్నల్స్ చంద్రుడిని చేరి.. మళ్లీ భూమికి అందుతున్నాయని, దీనితో ఓ సర్క్యూట్ పూర్తి అయినట్టు భావిస్తున్నామని అన్నారు. నాసా పంపిస్తున్న సంకేతాలు శక్తిమంతమైనవి కావడం వల్ల త్వరలోనే వాటిని విక్రమ్ ల్యాండర్ గ్రహించే అవకాశాలు ఉన్నాయని స్కాట్ టిల్లీ అభిప్రాయపడ్డారు.

Read Previous

కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల

Read Next

తలసాని కొడుక్కి ఫైన్ వెయ్యరా సార్?