#Chandrayaan2: ఛాలెంజిగ్ గా తీసుకోని సక్సెస్ అయ్యాడు

9

విక్రమ్ లాండింగ్ కూలిపోవడంతో.. దానికి సంబంధించిన శకలాల కోసం ఇస్రో, నాసా ప్రయత్నాలు చేశాయి. కానీ, గుర్తించలేకపోయాయి. అయితే, ఈరోజు నాసా ఆ శకలాలను గుర్తించినట్టు ప్రకటించింది. కానీ, ఆ శకలాలను గుర్తించింది నాసా కాదు. మనవాడే. మన భారతీయుడే. చంద్రయాన్ 2తో కానీ, నాసాతో కానీ అతనికి సంబంధం లేదు. అతనో అర్చిటెక్ట్ ఇంజనీర్. స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా. దీంతో ఈ ప్రాజెక్ట్ ను ఛాలెంజ్ గా తీసుకొని, నాసా గతంలో తీసిన ఫోటోలను, జూన్ 22 కు ముందు ఎక్కడైతే విక్రమ్ ల్యాండర్ దిగబోతుందో ఆ ప్రాంతాలను నిశితంగా పరిశీలించాలని అనుకున్నాడు. ఆ ఫోటోలకు సంబంధించిన పిక్సెల్ ను నిశితంగా పరిశీలించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ను తయారు చేసుకున్నాడు. దాని ఆధారంగా కష్టపడి విక్రమ్ శకలాల జాడ కనిపెట్టాడు. తన పరిశీలనా విధానాన్ని మెచ్చుకున్నది నాసా. చంద్రయాన్ 2 తో కానీ, నాసా ఎల్ఆర్ఓ తో కానీ సంబంధం లేని ఓ వ్యక్తి కేవలం ఆసక్తి మేరకు మాత్రమే ఇలా విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించాడని నాసా కూడా ఆ విషయాన్ని గుర్తించలేకపోయినట్టు నాసా పేర్కొన్నది.