నడిరోడ్డుపై కాల్పులు జరిపిన థియేటర్ ఓనర్
Timeline

నడిరోడ్డుపై కాల్పులు జరిపిన థియేటర్ ఓనర్

చెన్నై : దిండిగల్ జిల్లా పళని థియేటర్ యజమాని నటరాజ్ వీరంగం. భూ వివాదం కారణంగా ఇద్దరిపై కాల్పులకు తెగబడ్డ నటరాజ్ . తీవ్రంగా గాయపడ్డ పళనిస్వామి , సుబ్రమణి ఆసుపత్రికి తరలింపు. దీనితో థియేటర్ యజమాని అరెస్ట్.

నటరాజ్ మరియు ఇలంగోవన్ కి 12 సెంట్ల భూమి కారణంగా కొద్దీ రోజులుగా విభేదాలు మొదలయ్యాయి. ఆ భూమి ఇవ్వడానికి ఇలంగోవన్ ఒప్పుకొని కారణంగా నటరాజ్ ఆవేశానికి గురయ్యాడు. అక్కడ తన థియేటర్ పక్కన ఉన్న 12 సెంట్ల భూమికి ఫెంచింగ్ వేయడానికి వచ్చిన ఇలంగోవన్ మనుషులు పళనిస్వామి , సుబ్రమణి పై కాల్పులకు దిగాడు నటరాజ్.

ఇద్దరు ఆ కాల్పుల్లో గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్యులు. పోలీసులు కేసు ఫైల్ చేసి విచారన చేపట్టారు