చిరు నోట కొరటాల మెసేజ్

4

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు దసరా కానుక ప్రకటించారు. ఆయన 152వ సినిమా షురూ అయ్యింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. చిరు, రామ్‌ చరణ్‌, కొరటాల శివతోపాటు అంజనా దేవి, సురేఖ, సుస్మిత తదితరులు పూజకు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సురేఖ క్లాప్‌ కొట్టారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది.

చిరంజీవి@152.. షురూ!

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘సైరా’ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకుంది. అంతేకాదు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీసు వద్ద రెండు రోజుల్లో రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ‘సైరా’ చిరు 12 ఏళ్ల కల కావడం విశేషం. ఇన్నేళ్ల తర్వాత ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించి.. తండ్రి కలను సాకారం చేశారు. సురేందర్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు.

చిరంజీవి@152.. షురూ!

కమర్షియల్ సినిమాలతో మెసేజ్ ఇచ్చే కొరటాల శివ ఈ సారి చిరుతో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు అనేది అందరిలో ఆసక్తి కరమైన చర్చ ను రేకెత్తించింది