Breaking News :

అవసరమా చంద్రన్న నీకు ఇది

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు విచిత్రంగా కనిపిస్తున్నాయి.. 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా కాకుండా అవి కనిపించడం లేదు. ఒకప్పుడు ఆయన ప్లాన్ వేశాడంటే.. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేవారు.. కానీ ఇటీవల ఎందుకో ఆయనలో ఎత్తులు పైఎత్తులు కనిపించడం లేదు.

తాజాగా ఆయన తరచుగా పోలీసు వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసులు వైసీపీ నాయకులు చెప్పినట్టల్లా ప్రవర్తిస్తున్నారని ఆడిపోసుకుంటున్నారు. పోలీసులు జగన్ చెప్పినట్టల్లా చేస్తున్నారట.. ఏంటి జగన్ చంపేయమంటే చంపేస్తారా.. అని కూడా మొన్న ఒకసారి ప్రశ్నించారు చంద్రబాబు. ఆయన ఫస్ట్రేషన్ చూస్తుంటే ఒక్కోసారి జాలి కలుగుతోంది.

పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగడం ఏపీ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఏపీ అనే కాదు.. ఏ రాష్ట్రంలోనైనా పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకతప్పడం లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడూ ఇంతకు భిన్నంగా ఏమీ లేదు. కానీ.. చంద్రబాబు అదేదో కొత్త విషయం అన్నట్టు పోలీసులపై తరచూ ఫైర్ అవుతున్నారు.

అంతే కాదు.. పోలీసులు సీఎం చెప్పినట్టల్లా చేస్తే.. తాము పోలీసులపై కూడా కేసులు పెడతామని.. కోర్టులకు ఈడుస్తామని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. సీఎం పోలీసులను వాడుకుంటుంటే.. పోలీసు అధికారుల సంఘాలు ఏం చేస్తున్నాయని నిలదీస్తున్నారు.

చంద్రబాబు తీరు చూసినవారు..ఆయన ఎందుకు పోలీసులతో పెట్టుకుంటున్నారో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. చంద్రబాబు భద్రత కల్పించేది కూడా పోలీసు వ్యవస్థేనని.. చంద్రబాబు అనవసరంగా కొరివితో తలగోక్కుంటున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

Read Previous

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన అమిత్ షా

Read Next

పిల్లలు లేని తమకు ప్రజలే కుటుంబం