Breaking News :

కరోనా బ్రేకింగ్: దేశంలోనే ఫస్ట్..తెలంగాణలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

telangana clinical trails on humans for corona virus

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆ సంస్థ ఆవిష్కరించిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిమ్స్‌లో నేటి నుంచి ప్రారంభమైంది. ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్‌కు సమ్మతించిన వ్యక్తుల రక్త నమూనాలను నిమ్స్‌ సిబ్బంది సేకరించనున్నారు. ఆ రక్త నమూనాలపై వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపి.. ఆరోగ్యంగా ఉంటే వారం తర్వాత వారికి మొదటి డోస్‌ ఇస్తారు. 

‘‘ట్రయల్స్‌లో భాగంగా ఒక్కో వ్యక్తికి మూడు డోసులు ఇస్తాం. మొదటి డోస్‌ ఇచ్చిన తర్వాత ఆస్పత్రిలోనే రెండ్రోజులు పర్యవేక్షణలో ఉంచుతాం. 14 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇస్తాం’’అని నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ వెల్లడించారు.

Read Previous

EXCLUSIVE: అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ కన్ఫార్మ్

Read Next

బిగ్ బ్రేకింగ్: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు బాద్యులైన 12 మంది అరెస్ట్