కెసిఆర్ : ముందు ప్రజల శ్రేయస్సు .. ఆ తరువాత విమర్శలకు స్పందిద్దాం
Timeline

కెసిఆర్ : ముందు ప్రజల శ్రేయస్సు .. ఆ తరువాత విమర్శలకు స్పందిద్దాం

డతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ వాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. నగరంలో వరద ప్రభావానికి గురైన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మంగళవారం (అక్టోబర్ 20) ఉదయం నుంచే ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50,000ల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపడతామని.. మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం అందించారు. చెన్నై నుంచి పరుపులు, బెడ్‌షీట్లు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు అందించాల్సిందిగా పిలుపు ఇచ్చారు.

అయితే ఎన్నడూ లేని విధంగా ఎడతెరిపి లేని వానలు హైదరాబాద్ ని ముంచెత్తేసాయి. 108 సంవత్సరాల తరువాత ఇప్పుడే ఈ రేంజులో వర్షాలు రావడం. అంతే కాకుండా ప్రతిపక్షాలు ఇదే సమయంగా దీనిని రాజకీయం కోసం వాడేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఇందులో భాగంగానే ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై అధికార నేతలు ఎలాంటి కౌంటర్లు ఇస్తారా అని మీడియా ఒకవైపు చూస్తుంటే కెసిఆర్ మాత్రం విమర్శల జోలికెళ్లొద్దు, ఆపదలో ఉన్న వారికీ ముందు సాయం చేయండి , కౌంటర్ ఇచ్చే సమయం ఇది కాదు అంటూ నేతలకు నచ్చ చెప్పారని సమాచారం.

కెసిఆర్ స్టైల్ ఎప్పుడూ ఇదే, రాజకీయం చేసే టైమ్ లో మాత్రమే రాజకీయం చేస్తాడు. కరోనా విపత్తు సమయంలో పలు రాష్ట్రాలు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినా కూడా కెసిఆర్ మాత్రం మోడీని తప్పుపట్టలేదు