సుద‌ర్శ‌న్ రావు మృతి ప‌ట్ల‌ సీఎం కేసీఆర్‌ సంతాపం
Timeline

సుద‌ర్శ‌న్ రావు మృతి ప‌ట్ల‌ సీఎం కేసీఆర్‌ సంతాపం

టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, పార్టీ సీనియ‌ర్ నాయకుడు ఎం సుద‌ర్శ‌న్‌రావు క‌న్నుమూశారు. ఈరోజు ఉద‌యం ఆయ‌న గుండెపోటుతో మృతిచెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. సుద‌ర్శ‌న్ రావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఉద్య‌మ తొలినాళ్ల‌లో సుద‌ర్శ‌న్ రావు అద్భుతంగా ప‌నిచేశార‌ని సీఎం గుర్తుచేసుకున్నారు.

ఉద్యమ తొలినాళ్లలో అద్భుతంగా పని చేసిన నాయకుడని సీఎం కొనియాడారు . చిన్న వయస్సులో చని పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు . 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి TRS పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం .సుదర్శన్ రావు (62 )ఈ రోజు ఉదయం AIG హాస్పిటల్ గచ్చిబౌలి లో గుండె పోటు తో మరణించారు .ఆయన గత కొన్ని రోజులుగా కోవిడ్ బారిన పడి ఆ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.