బిగ్ న్యూస్: తెలంగాణ లో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
Timeline

బిగ్ న్యూస్: తెలంగాణ లో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. సోమవారం నుంచి యధావిధిగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేసింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నావారికి యధావిధిగా రిజిస్ట్రేష్లను నిర్వహించనున్నారు.

ఎల్లుండి నుంచి అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్లాట్‌ బుకింగ్‌లు ఎవరూ అడగవద్దని.. కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకూ గురికాకూడదన్నారు సీఎం కేసీఆర్‌.

Leave a Reply

Your email address will not be published.