Breaking News :

డైరెక్టుగా సర్పంచ్ కే ఫోన్ కొట్టిన కెసిఆర్

గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ గ్రామ సర్పంచ్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఫోన్‌ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ పలకరించారు. త్వరలో కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం గురించి చర్చించారు. 1500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్‌ పంప్‌హౌజ్‌ చివరిది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్‌ పంప్‌హౌ్‌సలో మోటార్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు సమాచారం.

Read Previous

చంద్రబాబు వల్ల కరోనా అంటూ ట్విట్టర్ లో ట్రెండ్

Read Next

జగన్ ప్రభుత్వం: చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలపై తీసుకున్న టీటీడీ బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయండి