‘డియర్ కామ్రేడ్’ పై కంప్లైంట్

వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ కి ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బ్రేక్ లు పడ్డాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా ఈ సినిమా ఇప్పుడు ప్లాగరిజం వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా షార్పేర్చుర్ అనే ఒక్క ఫోటోగ్రాఫర్ డియర్ కామ్రేడ్ సినిమాలో ఒక వీడియో లో తన వర్క్ ని కాపీ చేశారంటూ ఆరోపించారు.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఫోటో గ్రాఫర్ ఒక టైం లాప్స్ వీడియోని తయారు చేశారు. తాజాగా ఈ వీడియోని ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో తన పర్మిషన్ లేకుండా వాడారని అతని ఆరోపణ. దీంతో విజయ్ దేవరకొండ మరియు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాను తీవ్రంగా నిరాశ చెందుతున్నానని ఆరోపిస్తున్నారు ఆ ఫోటోగ్రాఫర్.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మరియు చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో ఇంకా చూడాల్సి ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.