జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ‘సైరా’ సెగ
Timeline

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ‘సైరా’ సెగ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే సైరా మూవీకి వారసుల సెగ తాగింది. ప్రస్తుతం ఈ మూవీపై ఫిర్యాదు నమోదైయింది. వివరాల్లోకి వెళ్తే,

సైరా నర్సింహారెడ్డి చిత్రంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు. కొణిదాల ప్రొడక్షన్ అధినేతలైనా చిరంజీవి, రాంచరణ్ లపై ఫిర్యాదు చేశారు నర్సింహారెడ్డి వారసులు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి కథను తమ నుంచి సేకరించిన సినిమా యూనిట్, తీర చూస్తే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. తమ వారసుల కథను వాటి వివరాలు తీసుకుని డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారన్న వారసులు వాపోయారు. ఇదే విషయం అడగడానికి గతంలో చిరంజీవి ఇంటికి వెళ్తే అక్రమంగా కేసులు పెట్టారన్నారు. చట్టపరంగా అగ్రీమెంట్ తీసుకున్న చిత్ర యూనిట్ మోసం చేసిందన్నారు. దీనిపై న్యాయం జరిగే వరకు సినిమా యూనిట్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published.