వైఎస్ షర్మిల రాజకీయ అరంగేట్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా, షర్మిల పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదిలిన బాణమే అని అన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ అని ఆరోపించారు.

జగన్ ఇప్పటికే బీజేపీ తో కలసి పనిచేస్తున్నారన్న జగ్గారెడ్డి.. ఇక్కడ కేసీఆర్ కూడా బీజేపీ డైరెక్షన్‌లోనే నడుస్తున్నారని విమర్శించారు.

వైసీపీ ,టిఆర్ఎస్ ,బీజేపీ మూడు కలసి కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దనే కుట్ర పన్నుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఇప్పుడు షర్మిల వచ్చిందని.. రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వ్యక్తి పార్టీ పెట్టొచ్చని అన్నారు.

ఆంధ్రా నేతలు ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంకా తెలంగాణకు ఎందుకు… ఉమ్మడి రాష్ట్రంలో కలిపేయండి అంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుని హైదరాబాద్ నుంచి పంపించడానికి ఎన్నో కుట్రలు చేసిన కెసిఆర్.. షర్మిల పార్టీ పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published.