కరోనా: ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 605 కేసులు నమోదు
Timeline

కరోనా: ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 605 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,305 మంది నమూనాలు పరీక్షించగా 605 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 35 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 570 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 11,489 కేసులు నమోదయ్యాయి.

కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో  కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలులో నలుగురు,  గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 146కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,196కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6,147 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు 7,91,624 శాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.