కరోనా హెల్ప్ కోసం ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేయండి
Timeline

కరోనా హెల్ప్ కోసం ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేయండి

కరోనా ఒక్క మన రాష్త్రాన్నో దేశాన్నో కాదు, యావత్ ప్రపంచాన్నే చీకటిలోకి నెట్టేసింది. ఒక వైపు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్లు ఎంత వరకు కరోనాని కట్టడి చేయడంలో ఉపయోగపడ్డాయో తెలియట్లేదు ఇంకా. కేసులు ఎక్కువగా లేనపుడు 2 నెలలు లాక్ డౌన్లు విధించాయి ప్రభుత్వాలు. ఇపుడేమో కేసులు పెరిగిపోతున్నాయి.

అయితే ఎక్కడ చుసిన ఏ సోషల్ మీడియా వేదికలైన, టీవీ డిబేట్లయినా కేవలం రాజకీయ విమర్శలు, ప్రజా ప్రతినిధుల మధ్య గొడవలు , టీఆర్పీ ల కోసం చెత్త న్యూస్, చెత్త ప్రోగ్రామ్స్ తప్ప ప్రజల్లో భయాన్ని తొలగించే కార్యక్రమాలు కానీ హెల్ప్ లైన్ నంబర్స్ కానీ టెలికాస్ట్ చేయట్లేదు.

ఇక సోషల్ మీడియా వేదికలపై కూడా రాజకీయ నాయకుల కోసం ట్విట్టర్ ట్రెండింగులు, ఒక పార్టీ కార్యకర్తపై మరో పార్టీ కార్యకర్తలు దుమ్మెత్తిపోసుకోవడం ఇదే జరుగుతుంది. ఇవే సోషల్ మీడియా వేదికల ద్వారా మంచి జరుగుతుంది. ఆ మంచిని చూయించేది ఎవరు ప్రజలకు? ఆ మంచిని చూయిస్తే అయినా ప్రజల్లో కాస్త భయం పోతుంది. ఎంతసేపు ప్రభుత్వాల తప్పులను ఎట్టి చూపడమే కానీ ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం పాటుపడేదెప్పుడు?

అందుకే టాలీవుడ్ లో హృదయ కాలేయం సినిమాతో అందరికి పరిచయం అయిన ఫిలిం మేకర్ సాయి రాజేష్ ఒక చిన్న ప్రయత్నంతో ముందుకొచ్చారు. ట్విట్టర్ కానీ ఏ ఇతర సోషల్ మీడియా వేదికలో అయినా సరే కరోనా తో ఇబ్బంది పడుతున్న వారికీ ఏ సమాచారం కావాలన్నా, సహాయం కావాలన్న , ఏ అత్యవసర పరిస్థితిలో ఎటువంటి వివరాల కోసం అయినా సరే ఒక హ్యాష్ట్యాగ్ తో మీరు ట్వీట్ చేస్తే సరిపోతుంది. ఆ హ్యాష్ ట్యాగ్ తో ఉన్న ట్వీట్స్ ని మానిటర్ చేసి మీకు వారికీ తోచిన సహాయం అందేలా చూస్తారు. ఇందులో మనమందరం భాగమే.

దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఈ విషయాన్నీ అందరికి చేరేలా చూడటమే. ఆపదలో ఉంది ఎవరైనా ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేయండి చాలు.

సాయి రాజేష్ :

మనిషి మనిషికి సాయం చేసుకోవాల్సిన సమయం ఇది..
నీకు నేను తోడున్నాను అని ఒకరికొకరం ధైర్యం
చెప్పుకోవాల్సిన సమయం ఇది…
వేలాది మంది కరోనా వైరస్ మహమ్మారి బారిన
పడుతున్నారు… సాయం కోసం మీ వెనక కనీసం మాట
సాయం చేసే మనిషి లేడని బాధ పడకండి…మీ తరపున
నేతలు, అధికారులని మేము అభ్యర్ధిస్తాము…
కోవిడ్ symptoms ఉండి, టెస్టులు జరగట్లేదా ?
అంబులన్స్ దొరకటం లేదా?
హాస్పిటల్ లో బెడ్స్ లేవా?
రక్తం అవసరం అవుతోందా?
వెంటిలేటర్ దొరకటం లేదా?
మరేదైనా సమస్య కి ఎవరూ స్పందించటం లేదా?
మీరు తెలంగాణ లో ఉన్నట్లయితే పూర్తి details తో,
రెండు వేర్వేరు ఫోన్ నంబర్లతో #COVID19TSHELP ,
మీరు ఆంద్రప్రదేశ్ లో ఉన్నట్లయితే పూర్తి details తో,
రెండు వేర్వేరు ఫోన్ నంబర్లతో #COVID19APHELP
అని hashtag తో మీ పూర్తి సమస్యని టైప్ చేసి ట్విట్టర్
లో ట్వీట్ చెయ్యండి. మీ తరపున మేము మాట్లాడి,
మాకు అయినంతలో సాయపడతాం.

Leave a Reply

Your email address will not be published.