IPL2020: సీజన్-13 పై కరోనా దెబ్బ.. నిర్వహణ కష్టమే!

ఎన్ని వైరస్‌లు వచ్చినా తట్టుకుని నిలబడిన మానవాళి కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్-13 కు కరోనా ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో మెగా ఈవెంట్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో భారత ప్రభుత్వం విదేశీ వీసాలపై నిబంధనల్ని కఠినతరం చేసింది. దౌత్య సంబంధిత, వర్క్ వీసాలకు మాత్రమే అనుమతిస్తోంది. దీంతో ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ లో కనిపించే పరిస్థితి లేదని గురువారం బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక, ఐపీఎల్ నిర్వహణపై ఈనెల 14న ముంబయిలో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.

Read Previous

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్ లైన్

Read Next

drunk and drive test: ఒకే స్ట్రాతో కరోనా సోకే ప్రమాదం ఉంది: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Leave a Reply

Your email address will not be published.