విశాఖపట్నంలో హై అలర్ట్‌: ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో హై అలర్ట్‌ను ప్రకటించింది. అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో చెస్ట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యాధికారులు వృద్ధుడి నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మరో ముగ్గురు వ్యక్తులకు కూడా ఇటువంటి లక్షణాలే ఉండటంతో శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడికి వెళ్లాడు అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ.. ఆశవర్కర్లు, వలంటీర్లతో కలిసి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 7,800 ఇండ్లను తనఖీ చేస్తున్నట్లు చెప్పారు. రసాయనాలు స్ప్రే చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్నవారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read Previous

కరోనా అప్‌డేట్స్‌: కరీంనగర్‌ కు కేసీఆర్

Read Next

మోహన్ బాబుకు సింహాసనం ఇచ్చిన మంచు లక్ష్మి