ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో జగన్ ప్రభుత్వ పరిపాలనపై రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంది. టీడీపీ ఒకవైపు, మరో వైపు బీజేపీ జనసేనలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి గత నెల రోజులుగా. ప్రభుత్వం విఫలమైందని సోషల్ మీడియా వేదికగా వారి వాయిస్ ని వినిపిస్తున్నారు. ఎందుకంటె కరోనా కారణంగా ప్రజల దగ్గరకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు.
అయితే జగన్ ప్రభుత్వం పై, జగన్ తీసుకున్న పలు నిర్ణయాలపై సీపీఎస్ టీం సర్వే చేసింది. దానికి సంబదించిన కొన్ని ఫలితాలను షేర్ చేసింది.
ఇందులో ముఖ్యంగా వారి సర్వేలో అడిగిన ప్రశ్నలు ఇవే.. ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రతిపక్ష పార్టీల స్థానం ఎలా ఉంది? పాలనా తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్లుగా ఈ ఏడాది కాలంలోనే వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యాబోధనపై ప్రజల అభిప్రాయాలేంటీ? మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతి పరిధిలో ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి? ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలుే నిర్వహిస్తే అధికారం ఎవరిని వరిస్తుందనే పలు ప్రశ్నలను ప్రజలకు సంధించారు.
ఈ సర్వే లు చేసిన ప్రాంతాలు ఇవే

సంవత్సర పాలనలో జగన్ ప్రభుత్వ పని తీరుపై సీపీఎస్ సర్వే
కరోనా వ్యాప్తి కట్టడిలో జగన్ ప్రభుత్వ పని తీరుపై ప్రజా అభిప్రాయం

ముఖ్యమంత్రిగా జగన్ పనితీరు, దూకుడు ఎలా ఉంది?

పాదయాత్ర సమయంలో చేసిన వాగ్దానాల విషయంలో జగన్ ప్రభుత్వం పని తీరు

ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంపై

జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై జనాభిప్రాయం

ప్రజల్లో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీపై ఎంత నమ్మకం ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న జగన్ నిర్ణయంపై ప్రజాభిప్రాయం

నోట్ : 95% ప్రభుత్వ పాటశాలల్లో చేర్పించే తల్లితండ్రులు జగన్ నిర్ణయానికే ఓట్ వేశారు