spot_imgspot_img

ఇద్దరితో రాసలీలు, వద్దన్న తల్లిని చంపిన కూతురు

యాదాద్రి జిల్లాలో కన్నతల్లిని సొంత కూతురు చంపేసిన ఘటన జిల్లాలో హాట్ టాపికైంది. రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి బతుకు దెరువు కోసం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రజిత, కూతురు కీర్తి ఉన్నారు. అయితే ఉన్న ఊరిలో సరిగా పని దొరక్క నాలుగేళ్ల కిందట కుటుంబాన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. లారీ డ్రైవర్‌గా పని దొరకడంతో ఆయన బిజీ అయిపోయారు.

అయితే నగరానికి వచ్చాక కూతురు పద్దతి మారింది. ఇటీవల తమ కూతురు ఇద్దరు వ్యక్తులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు తల్లి దృష్టికి వచ్చింది. అంతేకాదు ఆ ఇద్దరితోనూ హద్దులు దాటిన విషయం తెలియడంతో తల్లికి కోపమొచ్చింది. దాంతో అది పద్దతి కాదంటూ కూతురును హెచ్చరిస్తూ వచ్చారు రజిత. అయితే రోజురోజుకీ తల్లి పోరు పెరిగిందని భావించిన కీర్తి ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయింది.

తల్లి మాటలు రుచించలేదు.. అందుకే చంపేసింది

తల్లి తన బాగు కోరిందని కీర్తి భావిస్తే సీన్ వేరేలా ఉండేది. ఎంజాయ్ చేయడమే ఒక్కటే తెలిసిన కీర్తికి తల్లి మాటలు రుచించలేదు. ఒకరితో ప్రేమ వ్యవహారం నడిపి పద్దతిగా ఉంటే తల్లి కూడా ఒప్పుకుని ఉండేదేమో. అయితే కూతురు హద్దులు దాటి ప్రవర్తించడం.. అది కూడా ఇద్దరు వ్యక్తులకు దగ్గర కావడం ఆ తల్లి జీర్ణించుకోలేకపోయారు. అందుకే కూతురుకు మంచి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, కీర్తికి తల్లి హితబోధ నచ్చలేదు. అందుకే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హత్యకు పాల్పడింది.

ఇటీవల తన కూతురి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి రజిత ఆమెపై దృష్టి పెట్టారు. అయితే కీర్తి ఇద్దరు వ్యక్తులతో సన్నిహితంగా ఉంటూ హద్దులు దాటిందనే విషయం గ్రహించారు. అదే క్రమంలో ఆమెను మందలిస్తూ వచ్చారు. కూతురు తప్పుదోవ పడుతోందని ఆందోళన చెందిన తల్లి ఆమెకు మంచి మాటలు చెప్పేందుకు ప్రయత్నించారు. అవేమీ పట్టని కీర్తి తల్లిపై ద్వేషం పెంచుకుంది. చెడు అలవాట్లు మంచిది కాదని.. ఇలాగైతే జీవితంలో ఇబ్బందులు పడతావని హెచ్చరించింది. జీవితమంటే ఎంజాయ్ తప్ప మరొకటి కాదని భావిస్తూ వచ్చిన కీర్తి తల్లిని పరాయివారిలా చూసింది. తనకు అడ్డురావొద్దంటూ పలుమార్లు బెదిరించింది.

తల్లి చెప్పే మాటలు, హితబోధ తనకు రుచించని కీర్తి ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేసింది. డ్యూటీలో భాగంగా తండ్రి ఇతర ప్రాంతాలకు వెళ్లాడని, చాలా రోజుల వరకు ఇంటికి రాడని తెలుసుకున్న కీర్తి తల్లి హత్యకు ముహుర్తం ఫిక్స్ చేసింది. దానికి తన మొదటి బాయ్‌ఫ్రెండ్ సహకారం తీసుకుంది. అలా ఇద్దరూ కలిసి తమ ఇంటిలోనే రజితను చంపేశారు. అంతేకాదు ఆ డెడ్‌బాడీని ఇంటిలో పెట్టుకుని మూడు రోజుల పాటు శారీరక సుఖం అనుభవించారు. చివరకు దుర్వాసన వస్తుండటంతో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తమ స్వగ్రామమైన రామన్నపేట సమీపంలోని రైలు పట్టాల మీద రజిత మృతదేహం పడేశారు.

అక్కడితో కథ అయిపోలేదు. అలా తల్లి డెడ్‌బాడీని స్వగ్రామంలోని రైలుపట్టాల మీద పడేసి వచ్చాక ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో కనెక్ట్ అయింది కీర్తి. తండ్రి చాలా రోజుల వరకు రాడని తెలిసి.. వైజాగ్ టూర్‌కు వెళుతున్నట్లు ఆయనకు ఫోన్ చేసి చెప్పింది. అనంతరం రెండో ప్రియుడి సరసన చేరి కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది.

అయితే తండ్రి డ్యూటీ నుంచి ఇంటికి చేరుకున్నాక భార్య రజిత కనిపించలేదు. అదే విషయం కూతురును అడిగితే డొంక తిరుగుడు కథలన్నీ చెప్పింది. చివరకు ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. తల్లిని తానే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీర్తికి సహకరించిన ఆమె మొదటి ప్రియుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related Articles

Get in Touch

18,128FansLike
3,038FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts