దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ చిత్రం బహుబలి రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. అది ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సంపాదించి కోట్లు కొల్లగొట్టింది. అయితే, ఆ సినిమాలోని రెండు భాగాల ట్రైలర్లను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మార్ఫింగ్ చేశాడు. హీరో ప్రభాస్ దేహనికి తన ముఖాన్ని జత చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ రెండు వీడియోలకు లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయి. మరోవైపు, లాక్డౌన్ సమయం నుంచీ వార్నర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పలు భారతీయ సినిమా పాటలు, డైలాగులకు టిక్‌టాక్ వీడియోలు రూపొందించిన సంగతి తెలిసిందే.