హైదరాబాద్ మల్కాజిగిరి నేరెడ్‌మెట్ సంతోషిమా కాలనీలో నిన్న మిస్సైన బాలిక సుమీద(12) మృతదేహన్ని బండ చెరువు వద్ద డి.ఆర్.ఎఫ్ సిబ్బంది గుర్తించారు. రెండు కిలోమీటర్ల మేర నాలలో కొట్టుకుపోయింది చిన్నారి.

నిన్న మిస్సైన బాలిక సుమేధ (12) మృతదేహన్ని బండ చెరువు వద్ద డి.ఆర్.ఎఫ్ సిబ్బంది గుర్తించారు. రెండు కిలోమీటర్ల మేర నాలలో కొట్టుకుపోయింది చిన్నారి. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లి మీడియాతో మాట్లాడుతూ , చివరిసారిగా పాప మ్యాగీ చేయమని చెప్పి వెళ్లిందని తెలిపారు.

5 వ తరగతి చదువుతున్న సుమేధ కపురియా(12) అనే బాలిక నిన్న సాయంత్రం సైకిల్ తీసుకొని బయటకు వెళ్లింది. అయితే ఎంత సేపైన మళ్ళీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందారు తల్లిదండ్రులు. వెంటనే పోలీసులకు పిర్యాదు చెేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు నిన్న సాయంత్రం భారీ వర్షానికి దిన్ దయల్ నగర్ లో నాళాలు పొంగిపొర్లాయని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. నాల వద్ద చిన్నారి సైకిల్‌ను గుర్తించారు. దీంతో నాలాల వద్ద జిహెచ్‌ఎమ్‌సి అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీంలతో వెతకడం ప్రారంభించారు. మరోవైపు సిసి కెమెరాలను కూడా నేరెడ్‌మెట్ పోలీసులు పరిశీలించారు.

బాలిక నాలాలో కొట్టుకుపోయి ఉంటుందని అధికారులు గాలింపు చర్యలు జరపగా చివరకు సుమేధ మృతదేహం అక్కడే లభించింది.