spot_imgspot_img

ఢిల్లీలో వింత వర్షం … ఆయిల్ రెయిన్

దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురిసింది. అయితే వర్షం పడటంలో వింతేముంది అనుకుంటున్నారా ? అక్కడే ఉంది ట్విస్ట్ … ఇప్పటి వరకు నీళ్లు కురవడం తెలుసు, మంచి కురవడం తెలుసు, ఇసుక పడటం కూడా చూసాం , రాళ్లు పడటం కూడా చూసాం కానీ ఆయిల్ వర్షం పడటం చూసారా ..విన్నారా ?

నిన్న ఢిల్లీలో వర్షం కురుస్తుంటే అక్కడి అగ్నిమాపక శాఖకు వచ్చిన ఫోన్​కాల్స్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్య పోక తప్పదు. వాళ్ళ ఏరియాలో ఆయిల్ వర్షం కురుస్తోందంటూ కొందరు కాల్ చేసి ఫిర్యాదులు ఇవ్వడం చర్చనీయాశం అయింది. న్యూ ఢిల్లీలోఐ చాల ఏరియాల నుండి 57కు పైగా కాల్స్ వచ్చాయట అంతే కాకుండా అందరూ ఈ విషయం గురించే చెప్పి ఫిర్యాదు చేశారట.

దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతూనే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆయిల్ వర్షం వల్ల రోడ్లు జారుడుగా మారి ప్రజలు , వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో జామియా నగర్​కు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. ఈ విషయంపై ఫిర్యాదు మేరకు న్యూ ఫ్రెండ్స్ కాలనీలో అగ్నిమాపక సిబ్బంది పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Get in Touch

18,128FansLike
3,028FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts