మంగాయమ్మ కాన్పు చట్ట వ్యతిరేకం

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 74 సంవత్సరాల మంగాయమ్మ కాన్పు వ్యవహారంపై ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వృద్ధురాలికి ఐవీఎఫ్ చేసిన వైద్యులపై మండిపడింది.

‘74 ఏళ్ళ వయసున్న వృద్ధురాలికి ఐవీఎఫ్ చేయడం బుద్దిలేని పని’ అని IFS పేర్కొంది. పాపులారిటీ కోసమే ఆ డాక్టర్లురూల్స్ బ్రేక్ చేసారని మండిపడింది. చట్ట ప్రకారం 18 ఏళ్ల లోపు యువతులకు 45 ఏళ్లు దాటిన మహిళలకు IVF చేయకూడదని ఫెర్టిలిటీ సొసైటీ ఒక నోటీసులో మెన్షన్ చేసింది.