Breaking News :

డెంగీ పంజా.. దోచేస్తున్న డాక్టర్లు

పశ్చిమగోదావరి జిల్లాలో డెంగీ జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. డెంగీ జ్వరాలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలో జ్వరాల తీవ్రత ఏమాత్రమూ అదుపులోకి రాలేదు. రోజురోజుకీ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి నెలకొంది.

పారి శుధ్య లోపం, కలుషిత తాగునీరు వంటి వాటి ప్రభావం కారణంగా జనాన్ని జ్వరాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా జ్వరాలతో జనం హడలిపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 230 మంది డెంగీ బారినపడ్డారు. అధికారులు చెబుతున్న లెక్కల్లో ఏ మాత్రమూ వాస్తవం లేదని, భారీగా డెంగీ కేసులు నమోదవుతున్నాయని అంతర్గతంగా అధికారులే చెబుతున్నారు.

నమోదైన డెంగీ కేసుల్లో జిల్లా కేంద్రం ఏలూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సగానికిపైగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మలేరియా కేసులు 84 నమోదవ్వగా ఒక్క ఏజెన్సీలోనే 81 మంది మలేరియా బాధితులున్నారు. గతంకంటే ఈ కేసులు తక్కువగానే ఉన్నాయని మలేరియా అధికారులు చెబుతున్నారు. టైఫాయిడ్‌ లెక్కల గురించి అసలు చెప్పలేని పరిస్థితి ఉంది. టైఫాయిడ్‌ జ్వరాలు జనాలను చుట్టుముడుతు న్నాయి.

ఇదే అదునుగా ప్రయివేటు ఆసుపత్రులు రోగుల బంధువులను భయపెట్టి దోచేస్తున్నాయి. డెంగీ జ్వరమొస్తే కనీసంగా రూ.30 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. టైఫాయిడ్‌ జ్వరాలను సైతం డెంగీగా చెబుతూ ప్రయివేటు ఆసుపత్రుల్లో దోపిడీ చేస్తున్నారు.

Read Previous

వాల్మీకి రివ్యూ : చూడొచ్చా లేదా?

Read Next

Howdy, Modi : ట్రంప్ సంచలన ప్రకటన అదేనా?