షార్ట్ న్యూస్: పినాక రాకెట్ ప్రయోగం విజయవంతమైంది
Timeline

షార్ట్ న్యూస్: పినాక రాకెట్ ప్రయోగం విజయవంతమైంది

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ..డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అధునాతన పినాక రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

ఒడిశా చందిపుర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పినాక రాకెట్లను డీఆర్డీఓ పరీక్షించింది.

మొత్తం 6 రాకెట్లను ఒకదాని వెంట ఒకటి ప్రయోగించింది.

రాకెట్లన్నీ పూర్తిస్థాయిలో లక్ష్యాలను చేరుకున్నట్లు డీఆర్‌డీఓ తెలిపింది.

అత్యాధునిక పినాక రాకెట్లు.. ప్రస్తుతం ఉన్న పినాక ఎంకే-1 రాకెట్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.