ఆగిపోయిన సత్యాగ్రహిపై పవన్ స్పందన … దేవా కట్ట దర్శకత్వంలో ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ‘సత్యాగ్రహి’ అనే టైటిల్‌తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఇప్పుడు స్పందించడం విశేషం.

‘చాలా సంవత్సరాల క్రితమే ‘సత్యాగ్రహి’ని మొదలుపెట్టాను. ఆ చిత్ర పోస్టర్‌లో ఓవైపు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్, మరోవైపు చెగువేరా చిత్రాలను పెట్టాను. ఇప్పుడు నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే ఆ చిత్ర కథ. సినిమాల్లో పోరాటం చేసినంత మాత్రాన బయట పనులు జరగడం కష్టం. అందుకే సినిమాలతో పోరాటం చేయడం ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా ఆపేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. కానీ ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందున దాన్ని వదులుకోక తప్పలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

అయితే ఈ సినిమా కథను మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేసి దేవా కట్ట దర్శకత్వంలో చేయాలనేది పవన్ ఆలోచన అన్నట్టు సమాచారం