9 సంవత్సరాల క్రితం వరకు ధనుష్ అనే హీరో ఒకరు ఉన్నారని తమిళ్ నాడు కు తప్ప ఎవరికి తెలియదు. కానీ ఒక్క పాట , ఒకే ఒక్క పాట మనోడి రేంజ్ ను ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లింది. అదే వై దిస్ కొలవెరి డి అనే వైరల్ సాంగ్. ఇది ధనుష్ మరదలు దర్శకత్వం వహించిన 3 అనే సినిమా కోసం ధనుష్ రాసిన పాట. ఈ పాటకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు . ఈ పాట ఎంత పెద్ద హిట్ అంటే మాటల్లో చెప్పలేము. ప్రపంచం అంతా రేడియోల్లో అని దేశాల్లో మారు మోగింది. ఇంటర్నెట్ లో ఇదొక సంచలనం అప్పుడు.

ఈ పాట రిలీజ్ అయ్యి సరిగ్గా నేటికి 9 ఏళ్ళు. అంతే కాదు ధనుష్ మారి 2 లో రౌడీ బేబీ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా యూట్యూబ్ లో 1 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఏకైక సౌత్ ఇండియన్ సాంగ్ ఇదే అంట. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నాడు