Breaking News :

దిల్ రాజుకు కేసీఆర్ సంక్రాంతి గిఫ్ట్

సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. జనవరి 9న ఇప్పటికే దర్బార్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కూడా. తెలుగులోనే దాదాపు 5 కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. పండగ మంచి ఊపుతో మొదలు కావడంతో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాతో అది మరో స్థాయికి వెళ్తుందని నమ్ముతున్నారు బయ్యర్లు. దీనికి తగ్గట్లుగానే ఈ రెండు సినిమాలు భారీగానే విడుదలవుతున్నాయి. ఇక వీళ్ళకు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాయపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఆరు షోలకు అనుమతి ఇస్తూ జగన్ ప్రభుత్వం పర్మిషన్ లెటర్స్ ఇచ్చేసింది.

తెలంగాణలో కూడా కేసీఆర్ అనుమతి ఇచ్చేసాడు.

రాత్రి 1 నుంచి 10 గంటల వరకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దాంతో పండగ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. నైజాంలో ఈ రెండు సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దాంతో భారీగానే వసూళ్లు రాబట్టడం ఖాయంగా మారిపోనుంది.

Read Previous

ఆంధ్రాలో CAAకు మద్దతుగా బిజెపి విష్ణువర్ధన్ ర్యాలీ

Read Next

పవన్ కీలక వ్యాఖ్యలు