వకీల్ సాబ్ – కోర్టుకు వెళ్లిన దిల్ రాజు ?
Timeline

వకీల్ సాబ్ – కోర్టుకు వెళ్లిన దిల్ రాజు ?

ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ‘ఓ మై ఫ్రెండ్’ ,’ఎంసిఏ’ చిత్రాల దర్శకుడు వేణు శ్రీ రామ్  ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ,బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కరొన కారణంగా ఆగిపోయిన చాలా సినిమాలు ఇప్పుడు తిరిగి షూటింగ్ జరుపుకుంటున్నాయి.కానీ పవన్ సినిమా దాదాపు ఏడు నెలలు నుంచి  షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు. పవన్ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళికి మొదలుపెట్టిన దీక్ష కారణంగా షూటింగ్ కి రాలేదు.

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కోర్టుకెక్కాడు.

మొన్నా మధ్య , వకీల్ సాబ్ కి సంబందించిన ఫోటోలు వీడియోలు లీక్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. అయితే ఇకపై సినిమా రిలీజ్ వరకు ఎవరైనా ఈ సినిమాకి సంబందించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ చేసిన , లీకైనవి సోషల్ మీడియాలో షేర్ చేసినా వారికీ 5000 రూపాయలు జరిమానా విధించి, 1 సంవత్సరం జైలుకు పంపేలా శిక్ష విధించాలి అంటూ కోర్టుకు వెళ్లిన్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందొ దిల్ రాజు కానీ అయన నిర్మాణ సంస్థ కానీ అధికారికంగా ప్రకటిస్తే కానీ మనకు తెలియదు. కానీ ఇపుడు ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.