ఫిదా సినిమా రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త సినిమా మళ్లీ మొదలవుతుంది. ఈ సినిమాకి సందంధించిన పూజా కార్యాక్రమలు సోమవారం జరిగాయి. ఈ సినిమాలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి లు హీరో-హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

పూజా కార్యక్రమం తరువాత ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… నేను రొమాంటిక్ కామెడి, లవ్ స్టోరీ లు ఎక్కువగా చేశాను.మొదటి సారి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేస్తున్నాను.పల్లెటూరు నుండి జీవితం మీద ఎన్నో ఆశలతో హైదరాబాద్ కి వచ్చిన ఇద్దరి కథ ఈ సినిమా.

మామూలుగా నా సినిమాలో మ్యూజిక్ పైన శ్రద్ద తీసుకుంటాను. ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీ అవడం వల్ల కొంచెం ఎక్కువగా శ్రద్ద తీసుకున్నాను. ఈ సినిమాలో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడిగా కనబడనున్నాడు. నాగ చైతన్య తెలంగాణ యాస కోసం చాలా కష్టపడుతున్నాడు. నాగ చైతన్య ఇలాంటి క్యారక్టర్ ఎప్పుడు చేయలేదు. ఆయన క్యారక్టర్ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమాకి రెహమాన్ శిష్యుడు పనన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. పనన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాని మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings