కరోనా: మా ఇంటికి రావొద్దు, గేట్ కి స్టిక్కర్లు

విదేశాల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి మంగళవారం నుంచి రెడ్ నోటిసులు జారీ చేస్తోంది. కుటుంబసభ్యుల అనుమతితో ‘ఈ ఇంటికి రాకూడదు.. ఆరోగ్య నిర్బంధంలో ఉన్నది’ అని రాసి ఉన్న నోటీసులను ఇళ్లకు అంటిస్తున్నారు.

అలాగే 20 వేల బృందాలు ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారికి ఇప్పటికే క్వారంటైన్ ముద్రలు వేశారు. ఇకపోతే 20 రోజులు ముందే విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న చాలామంది తమ వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఇటలీ, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్‌ నుంచి వచ్చినవారు వేలసంఖ్యలో ఉన్నారని సమాచారం. 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతుందటంతో అధికారులు డేగ కన్నుతో నిఘా వేశారు. కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరుకుంది.

Read Previous

కరోనా: తమిళనాడులో మొదటి మరణం, ఇండియా టోటల్ 11

Read Next

అమ్మో కరోనా, వామ్మో బంగారం