Breaking News :

అసలు నిజం: డాక్టర్ కాదు యాక్టర్: పచ్చ మీడియా పిచ్చి కుట్రలు

కరోనా వైరస్‌ సోకిన బాధితులకు చికిత్స చేసే వైద్యులకు ఎన్‌- 95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థీషియా డాక్టర్‌ సుధాకర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం డాక్టర్ సుధాకర్ గుండు కొట్టించుకుని నడిరోడ్డుపై హల్ చల్ చేసాడ. దీంతో పోలీసులు ఆయన చేతులు వెనక్కి కట్టేసి కొట్టుకుంటూ తీసుకెళ్లారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటన శనివారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, సోషల్ మీడియా వేదికగా డాక్టర్ సుధాకర్‌కు అనుకూలంగా పోస్టులు చేస్తున్నారు.

అసలు పోలీసులు అతి చేసారు, జగన్ ని ప్రశ్నించడం వల్లే ఆ డాక్టర్ కి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు పోలీసులు అని యెల్లో మీడియా ప్రచారం మొదలెట్టింది నిన్నటి నుండి. అయితే ఎంతసేపు పోలీసులు తన్ని తీసుకెళ్లిన దృశ్యాలు మాత్రమే వేస్తున్నారు కానీ సోషల్ మీడియాలో మనోడు చేసిన అతిని బయటపెట్టిన వీడియోలు మాత్రం టెలికాస్ట్ చేసే ధైర్యం చెయ్యట్లేదు.

ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే ప్రశ్నించే స్వేచ్ఛ, స్వతంత్రం ఈ దేశ పారుడిగా ప్రతీ ఒక్కరికి ఉంది . అది బాధ్యత కూడా. అయితే నీ స్వేచ్ఛ, స్వతంత్రం మితిమీరి పక్కోడి స్వేచ్చకు, స్వతంత్రానికి భంగం కలిగించే చర్యలపై పోలీసులు యాక్షన్ తీసుకోవడం కూడా ఈ దేశపు రాజ్యాగం ఇచ్చిన్న హక్కే అన్న విషయాన్ని ఈ యెల్లో మీడియా మరిచిపోయినట్టుంది.

డాక్టర్ సుధాకర్ అక్రమాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. 2017 లోనే ఈయన గారు చేసిన అతి న్యూస్ పేపర్లలో వచ్చింది. మరి కొద్దీ క్షణాల్లో పురుడుకు సిద్ధంగా ఉన్న మహిళకు సర్జరీ చేయకుండా సెలవు పెట్టి విహారయాత్రకు వెళ్లిన గొప్ప డాక్టర్ ఈ సుధాకర్ అంటూ ఈనాడు పత్రిక & మరో ఇంగ్లిష్ పత్రిక కథనాలు కూడా ప్రచురించాయి.

ప్రజలేమైనా పిచ్చోళ్లా..యెల్లో మీడియా ప్రచారాలు నమ్మడానికి. ఈ రోజులో సోషల్ మీడియా చాలు ఎవరు చెపుతుంది నిజం ఏంటి అని తెలుసుకోడానికి. మాస్కులు లేవని జగన్ ప్రబుత్వాలన్నీ ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ అని ఇలా యెల్లో మీడియా వార్త వేసిందో లేదో క్షణాల్లో సోషల్ మీడియాలో మనోడు వెళ్లి టీడీపీ నాయకులను కలిసిన సీసీటీవీ వీడియోలు బయటకు లీక్ అయ్యాయి.

ఇక నిన్న జగన్ ని , తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని అసభ్య పదజాలంతో దూషించి నది రోడ్డుపై వచ్చేవేళ్లే వాళ్ళను తిడుతూ, కరోనా లాంటి సమయంలో లాక్ డౌన్ లో పోలీసులు ఎంతో కష్టపడి సేవలు అందిస్తుంటే వాళ్ళ ఉద్యోగానికి భంగం కలిగించడమే కాకుండా తన డ్యూటీ తానూ చేసినందుకు ఒక మధ్య తరగతి కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

అధికారంలో ఉన్న ప్రభుత్వం అండదండలతో బెస్ట్ డాక్టర్ అని అవార్డులు ఇప్పించుకున్నంత మాత్రానా , సూపరిండేంట్ స్థాయి తెచుకున్ననంత మాత్రానా ప్రజలు నమ్మే స్థితిలో లేరు వీళ్ళ అరాచకాలు.

ఈ డాక్టర్ పై అటు ఆంధ్ర ప్రభుత్వమే కాదు తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఒక గొప్ప స్థాయిలో ప్రజలు ఓట్లు వేసి కూర్చోబెట్టింది వాళ్ళ మీద నమ్మకంతో గౌరవంతో. అలాంటి స్థాయిలో ఉన్నవాళ్లపై డాక్టర్ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే వ్యాఖ్యలా అవి. అంతటి అహంకారం ఎవరు మద్దతు చూసుకొని రెచ్చిపోయి ఉంటాడు?

అందుకే ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసులు కూడా దీనిపై సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.

అంతే కాదు హిందూ ముస్లింలకు మధ్య గొడవలు జరిగేలా ఈ డాక్టర్ సాబ్ చేసిన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్టీ గౌరవించడం ఏంటో, వెళ్లి ఈయన గారికి సహాయ సహకారాలు అందించడం ఏంటో.

Read Previous

ఏపి రెడ్ జోన్ ప్రాంతాల లిస్టు : AP Redzone areas list

Read Next

వలస కూలీలకు విజయవాడ పోలీసుల సేవ అద్భుతం