Breaking News :

కొత్త రూల్ : హెల్మెట్ లేకుండా దొరికితే 1 నెల రోజులు …

బయటకు వెళ్లేటప్పుడు మీ వాహనానికి సంబంధించిన పత్రాలను మరువకండి. ద్విచక్రవాహనదారులు ముఖ్యంగా హెల్మెట్ అస్స‌లు మ‌ర‌వ‌కండి. ఎందుకుంటే పొలీసు, రవాణా శాఖ అధికారులు ఈ నెల 12 నుంచి సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహన చోదకులపై కేసులు నమోదు చేయడంతోపాటు నెల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తారని అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు.

ఓ కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. అలాగే ఉప రవాణా కమిషనర్‌ మీరాప్రసాదు మాట్లాడుతూ అర్హులైన 150 మంది పొలీసు సిబ్బందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు అందించినట్టు తెలిపారు. మ‌రియు వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ఈ నెల 30 వరకు పొడిగించామని తెలిపారు.

Read Previous

ట్రంప్ సార్.. ఏంది గీ కొత్త రూల్ మావోళ్లకు

Read Next

ఖైదీ నెంబర్ 4412 : రాత్రి జైల్లో రవి ప్రకాష్